¡Sorpréndeme!

MI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP Desam

2025-04-07 0 Dailymotion

 పది సంవత్సరాలు అక్షరాలా పది సంవత్సరాలు. ఆర్సీబీ ముంబైలో మ్యాచ్ గెలిచి. చివరిసారిగా 2015లో ఓ ఐపీఎల్ మ్యాచ్ లో వాంఖడేలో ముంబైని ఓడించింది ఆర్సీబీ. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకూ ఆ ఫీట్ సాధ్యపడలేదు. కానీ ఈ సారి ఆర్సీబీ దూకుడు మీద ఉంది. లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద ఓడిపోయినా అంతకు ముందు కేకేఆర్, సీఎస్కే లాంటి బలమైన జట్లను ఆర్సీబీ మట్టి కరిపించింది అన్న విషయం మర్చిపోకూడదు. ప్రత్యేకించి చెన్నైని చెపాక్ స్టేడియంలో 17ఏళ్ల తర్వాత ఓడించింది ఆర్సీబీ. అంతటి దూకుడు ఆర్సీబీ ముక్కుకు కళ్లెం వేయటానికి ముంబై అంత బలంగా ఉందా అంటే ఇప్పటివరకూ లేదు కానీ ఇప్పుడో ముంబై శిబిరంలో కొత్తగా ఓ శక్తి వచ్చింది. ఆశక్తి పేరే జస్ ప్రీత్ బుమ్రా. లక్నో సూపర్ జెయింట్స్ మీద జరిగిన మ్యాచ్ లో రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మ మళ్లీ తిరిగి ఆర్సీబీ మ్యాచ్ లో ఫ్రెష్ గా బరిలోకి దిగుతున్నాడు. సో రోహిత్, బుమ్రా ద్వయం కలిసి రజత్ పటీదార్ నేతృత్వంలోని కొహ్లీ అండతో చెలరేగిపోతున్న ఆర్సీబీ ని ఎంత వరకూ ఆపగలరన్నది ప్రధాన ప్రశ్న. ముంబై బ్యాటింగ్ లో చాలా లోపాలున్నాయి. సూర్య కుమార్ యాదవ్ టచ్ లో ఉన్నా మిగిలిన బ్యాటర్లలో కాన్ఫిడెన్స్ కనిపించటం లేదు. హార్దిక్ పాండ్యా డెసిషిన్ కారణంగా తిలక్ వర్మ అయితే లాస్ట్ మ్యాచ్ లో జరిగిన రిటైర్డ్ అవుట్ ఘటనకు బాగా ఫీలై లో లో ఉండి ఉంటాడు. వాటన్నిటినీ బద్ధలు కొట్టుకుని ముందుకు వస్తే ఆర్సీబీ కి టఫ్ కాంపిటీషన్ ఖాయం.  బౌలింగ్ లో బుమ్రాతో పాటు యువ సంచలనం అశ్వనీ కుమార్, స్పిన్ సెన్సేషన్ విఘ్నేశ్ పుత్తూరు చెలరేగాలని ముంబై కోరుకుంటోంది. అటు ఆర్సీబీ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ ఇచ్చే ఆరంభం పైనే అంతా ఆధారపడి ఉంటుంది. పటీదార్, జితేశ్, టిమ్ డేవిడ్ మంచి టచ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, సూయాశ్ శర్మ కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. పవర్ ప్లేల్లో వికెట్స్ నిలబెట్టుకుని రన్స్ రాబట్టిన టీమ్ దే విజయం కావొచ్చు. ముంబై ఈ విషయంలో బలహీనంగా కనిపిస్తోంది. మరి పాండ్యా సేన దీన్ని ఓవర్ కమ్ అవుద్దో చూడాలి. లేదా విరాట్ కొహ్లీ రోహిత్ శర్మ గడ్డపై వీర విహారం చేసి పదేళ్ల కరువు తీరుస్తాడేమో తెలియాలంటే ఈ రోజు రాత్రి వరకూ ఆగాల్సిందే.